Amanagallu: ఆమనగల్లులో గణనాథునికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రత్యేక పూజలు
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బుద్దినాథ్ వినాయక ఉత్సవ సమితి మండపంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
Amanagallu: ఆమనగల్లులో గణనాథునికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రత్యేక పూజలు
రంగారెడ్డి జిల్లా: ఆమనగల్ మండల కేంద్రంలో :-వినాయక చవితి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలో బుద్దినాథ్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయకునికి పుష్పాలు,కొబ్బరికాయలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని,గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వినాయకుడిని పూజించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులను శాలువాలతో సత్కరించారు.....
ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఖలీల్,కోట శ్రీనివాస్,చుక్క నిరంజన్,సురమల్ల సుభాష్,చందు,కుడుముల శ్రీనివాస్ రెడ్డి,అనంతుల సైదులు,శ్రీశైలం,గుత్తి బాలస్వామి, రాములు, నిర్వాహకులు సతీష్,కిరణ్, బుజ్జి,చింటు,గణేష్,కార్తిక్,భరత్,వస్పుల కృష్ణ,శివ,కార్యకర్తలు,యువకులు,గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.




