Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఘనంగా జరిగిన ఓనం పండుగ వేడుకలు
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని అరబిందో ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఘనంగా జరిగిన ఓనం పండుగ వేడుకలు
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని అరబిందో ఉన్నత పాఠశాలలో గురువారం కేరళ రాష్ట్ర ప్రత్యేక పండుగ ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఓనం వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నాగమణి మాట్లాడుతూ ఓనం పండుగ ప్రత్యేకతను, కేరళ సంస్కృతిలో దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, నరేష్, నజీర్, రతీష్, శేఖర్, శ్రీను, రఘు, రాధా, సునీత, సౌజన్య, ప్రేమలత, భార్గవి, సంధ్య, శైలజ, యామిని, నహీదా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story




