Amanagallu: ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం దళితులకే కేటాయించాలి!

Amanagallu: ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలి. సీనియర్ నేత పసుపుల జంగయ్యకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డికి కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Nov 2026 9:38 AM IST
Amanagallu
X

Amanagallu: ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం దళితులకే కేటాయించాలి!

Amanagallu: ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చరిత్రలో తొలిసారిగా దళిత సామాజిక వర్గానికి చైర్మన్ పదవి కల్పించాలని కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22తో ప్రస్తుత చైర్మన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పసుపుల జంగయ్యకు అవకాశం కల్పించాలని కోరారు. సుమారు 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జంగయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ ఉపాధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు.

గత 12 ఏళ్లుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు.ఆమనగల్లు, మాడ్గుల్, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో జంగయ్యకు మంచి గుర్తింపు ఉందని, ఆయనకు చైర్మన్ పదవి కల్పించడం ద్వారా దళిత సామాజిక వర్గానికి సముచిత గౌరవం ఇచ్చినట్లవుతుందని మెకానిక్ బాబా అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే ఈ విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY