Amanagallu: ఆమనగల్లులో ఘనంగా అఖిల భారత సహకార వారోత్సవాలు

Amanagallu: ఆమనగల్లులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకార వారోత్సవాలను ప్రారంభించి, రైతుల భాగస్వామ్యంతోనే సంఘాల అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 14 Nov 2026 7:11 PM IST
Amanagallu: ఆమనగల్లులో ఘనంగా అఖిల భారత సహకార వారోత్సవాలు
X

ఆమనగల్లు: రైతుల భాగస్వామ్యం తోనే సహకార సంఘాల అభివృద్ధి సాధ్యమవుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్ చైర్మన్ యాట గీతా నరసింహ, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ లతో కలిసి వారోత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు.

రైతుల భాగస్వామ్యంతో సహకార సంఘాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సహకార సంఘాల బలోపేతానికి అన్ని సంఘాల పాలకవర్గ సభ్యులతో పాటు సహకార శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు. అన్నదాతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.

సహకార సంఘం ద్వారా వివిధ రకాల రుణాలను అందుకొని రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీపీపీసీ సభ్యులు ఆయిల్ల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్య నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్లు కాలే మల్లయ్య, ఆనంద్ కుమార్, కిషన్ నాయక్, గౌని లక్ష్మమ్మ, పెంటమ్మ, బాల్ రెడ్డి, భగవన్ రెడ్డి, రాజు, సీతారాం, నిట్ట నారాయణ, ఒగ్గు వెంకటమ్మ, సీఈఓ పద్మాకర్ రెడ్డి, సిబ్బంది గోరేటి దేవేందర్, మహేష్, ఆనందు, సురేష్, దస్తగిరి తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY