Amangal: కేసీఆర్ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధి..గంప వెంకటేష్ గుప్తా!
Amangal: ఆమనగల్ మండలం రామ్ నుంతలలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా. కేసీఆర్ హయాంలోనే తండాల అభివృద్ధి.
Amangal: కేసీఆర్ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధి..గంప వెంకటేష్ గుప్తా!
Amangal: కెసిఆర్ ప్రభుత్వ హయాంలోనే గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. గురువారం మండలంలోని రామ్ నుంతల గ్రామపంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆ గ్రామ సర్పంచ్ వి శ్రీను నాయక్ తో కలిసి వెంకటేష్ గుప్తా పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో గిరిజన తండాలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. ముఖ్యంగా మౌలిక వసతులు సిసి రోడ్లు భూగర్భజల డ్రైనేజీలు కేసీఆర్ హయాంలో గిరిజన తండాలు గ్రామాలు రూపులేఖలు మారాయన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 500 జనాభా గల తండాలు గూడాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గిరిజనులకు గత ప్రభుత్వం 10% రిజర్వేషన్లు అమలు చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 12 శాతం ఇస్తామన్న గిరిజన రిజర్వేషన్లను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్త్యావత్ శ్రీను నాయక్, ఉప సర్పంచ్ రాజేశ్వరిమోహన్, వార్డు సభ్యులు పాత్లావత్ ధనరాజ్, శంకర్ నాయక్, కృష్ణ నాయక్, బిఆర్ఎస్ అధ్యక్షుడు గడియ శేఖర్, బిఆర్ఎస్ నాయకులు రూప్సింగ్ నాయక్, కృష్ణ నాయక్, నరేందర్ నాయక్, రాజేందర్, శాంతిలాల్, హమ్లా నాయక్ నరీ పాల్గొన్నారు.




