Amanagallu: సర్పంచ్ నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నేతలు

Amanagallu: ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి సర్పంచ్ నరేందర్ రెడ్డి మాతృమూర్తి భారతమ్మ మృతి పట్ల సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను పరామర్శించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Aug 2026 9:16 PM IST
Amanagallu
X

Amanagallu: సర్పంచ్ నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నేతలు

ఆమనగల్: ఆమనగల్ మండలం, ఆకుతోటపల్లి గ్రామ సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి మాతృమూర్తి కీ.శే. శ్రీమతి భారతమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

ఈరోజు ఆకుతోటపల్లి గ్రామంలో నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కీ.శే. భారతమ్మ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు,మాతృమూర్తిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, నరేందర్ రెడ్డి , కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కీ.శే. భారతమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో.. ఉప సర్పంచ్ శ్రీను,వార్డు సబ్యులు కృష్ణయ్య లతో పాటు మల్లేష్,ఎం.మల్లేష్ అశోక్, శివ,రాజశేఖర్, సురేందర్, సంతోష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story