Rangareddy: ఆమనగల్లులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం!

Rangareddy: ఆమనగల్లులో కాంగ్రెస్ నాయకుల ఆందోళన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Oct 2026 6:00 PM IST
Rangareddy
X

Rangareddy: ఆమనగల్లులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం!

Rangareddy: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని శ్రీశైలం జాతీయ రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రఘురాములు, మార్కెట్ డైరెక్టర్ వాస్పుల శ్రీశైలం, ఆదివాసీ కోఆర్డినేటర్ కృష్ణ నాయక్, మాజీ ఎంపీపీ విజయ్,

ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీద్, కాంగ్రెస్, సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, వగ్గు మహేష్, బాబా ,మల్లేష్ నాయక్, ఉప్ప సర్పంచ్ విజయ్ నాయక్, అమర్‌సింగ్, గాజుల శ్రీను, అలీం, సురేష్, నాసర్, రాఘవేందర్, రహీం, కృష్ణ యాదవ్, కండె సాయి, రాజు, మహేష్, కరీం, గౌస్, రఫీ, శివ, హరిలాల్, పరమేష్, నర్సింహ, గోపాల్, మైసయ్య, అంజాద్, తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY