Amangal: ఆమనగల్ కట్టమైసమ్మ ఆలయానికి సప్పిడి కుటుంబం త్రిశూలం సమర్పణ
Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయానికి తుక్కుగూడకు చెందిన సప్పిడి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో త్రిశూలం సమర్పించారు.
Amangal: ఆమనగల్ కట్టమైసమ్మ ఆలయానికి సప్పిడి కుటుంబం త్రిశూలం సమర్పణ
ఆమనగల్: ఆమనగల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో త్రిశూలం సమర్పించారు. తుక్కుగూడకు చెందిన అమ్మవారి భక్తులు సప్పిడి లక్ష్మీదేవి–నరసింహ కుటుంబ సభ్యులు, వారి కుమారుడు సప్పిడి సారిక సందీప్, సప్పిడి శివాని కలిసి భక్తితో త్రిశూలాన్ని అమ్మవారికి సమర్పించారు.
ఈ త్రిశూలాన్ని ఆలయ చైర్మన్ ముత్తాల వెంకటయ్య, మత్స్యకార సంఘం అధ్యక్షుడు ఎర్రవోలు యాదయ్య, 9వ వార్డు కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్‌కు అందజేశారు. అమ్మవారి సేవలో భాగంగా భక్తితో త్రిశూలాన్ని సమర్పించిన దాతల కుటుంబంపై శ్రీ శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆలయ అభివృద్ధి కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు




