Amangal: శెట్టిపల్లిలో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్

Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్; ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కలు వేయించాలని పిలుపు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Nov 2026 8:28 PM IST
Amangal
X

Amangal: శెట్టిపల్లిలో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఆమనగల్లు మండల్ శెట్టిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ వెంకటయ్య పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY