Hyderabad: గురుకులాల దుస్థితిపై మండిపడ్డ ఆనంద్ గౌడ్!

Hyderabad: రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, మౌలిక వసతుల లేమిపై టీబీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆగ్రహం.

G. Govind, Medchal
Published on: 17 July 2026 3:32 PM IST
Hyderabad
X

Hyderabad: గురుకులాల దుస్థితిపై మండిపడ్డ ఆనంద్ గౌడ్!

Hyderabad: గురుకులాలలో ఫుడ్ పాయిజన్, అనేక సమస్యలతో విద్యార్థులు చనిపోతున్నారు..

మేము గతంలో రాష్ట్రంలో ఉన్న గురుకులాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

గతంలో కొంత మెరుగైన..ఇప్పుడు మరలా పాత సమస్యలు గురుకులాలో వచ్చేశాయి..

గత ఏడాది వచ్చిన సమస్యలని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు..

ఆర్ధిక ఇబ్బందులతోనే పిల్లలు చదువుకోవడానికి గురుకులాలకు వస్తున్నారు..

గత ఏడాది ఫుడ్ పాయిజన్ తో 100 మంది చనిపోయారు..వేల మంది అనారోగ్యానికి గురయ్యారు..

గురుకులాల్లో ఉన్న ఇబ్బందులతో చిన్నారులు కూడా రోడ్ పైకి వస్తున్నారు..

నిజామాబాద్ లో విద్యార్థులు తమ సమస్యలను మీడియాతో చెప్పుకున్నారు..

ఒకే రూమ్ లో అన్ని క్లాస్ లు చెపుతున్నారు.. ఉండటానికి, తినడానికి ఫుడ్ ఉండటం లేదని తమ బాధ ని చెపుతుంటే బీసీ మంత్రికి అర్థం కావడం లేదా..

బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి..

విద్యార్థుల మాటలు వింటే..మీరు సిగ్గుపడాలి పొన్నం ప్రభాకర్..

మీ పార్టీలో జరిగే కొట్లాటలు పరిష్కరించేందుకే మీకు టైం సరిపోతుంది..

సీఎం రేవంత్ రెడ్డి తన సీట్ కాపాడుకోవడానికే టైం సరిపోతుంది..

గురుకులాల సమస్యలపైన ఎలాంటి సమీక్షలు లేవు..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గురుకులాల పరిస్థితి పై విద్యార్థులు ర్యాలీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి..

పాలమూరు బిడ్డని, చిరుతను అని చెప్పే రేవంత్ రెడ్డి కి అ విద్యార్థుల ఘోష వినపడటం లేదా..

మేము వచ్చే నెల నుండి రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులాలు విజిట్ చేసి..అక్కడి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తాం..

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story