Kushaiguda: శేషవాహనంపై శ్రీవారి వైభవోత్సవం.. భక్తిపారవశ్యంలో కుషాయిగూడ!
Kushaiguda: కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
Kushaiguda: శేషవాహనంపై శ్రీవారి వైభవోత్సవం.. భక్తిపారవశ్యంలో కుషాయిగూడ!
Kushaiguda: కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశేష పూజల అనంతరం శేషవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
బ్రహ్మోత్సవాల ఆరంభంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం నిర్వహించారు. అనంతరం దీక్షాధారణ, కంకణధారణ పూజలు చేపట్టారు. వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల మధ్య స్వామివారి శేషవాహన సేవ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మఠం వీరేశం మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.
కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఉప్పల విజయభాస్కర్ రెడ్డి దంపతులు, పల్లె శ్రీకాంత్ రెడ్డి, మాజీ ధర్మకర్త కొమిరెల్లి సుధాకర్ రెడ్డి, పంజాల శ్రీనివాస్ గౌడ్, సంజయ్ పాల్గొన్నారు. అర్చకులు కలకోట వెంకటరమణాచార్యులు, ఆరుట్ల నారాయణాచార్యులు, వేణుగోపాలాచార్యులు, బిటకూరి లక్ష్మణాచార్యులు, శేషాచార్యులు, వెంకటరమణ రావు, సత్యనారాయణ శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.




