Malkajgiri: యాంటీబయాటిక్స్, శిశు సంరక్షణపై అవగాహన

Malkajgiri: ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీమైక్రోబియల్, నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించి, వైద్యుల సూచన మేరకే యాంటీబయాటిక్స్ వాడాలని తెలిపారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 19 Nov 2026 6:06 PM IST
Malkajgiri
X

Malkajgiri: యాంటీబయాటిక్స్, శిశు సంరక్షణపై అవగాహన

మల్కాజిగిరి: యాంటీబయాటిక్స్‌ను వైద్యుల సూచనల మేరకే వినియోగించాలని, అనవసరంగా వినియోగించడం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (మందులకు సూక్ష్మజీవులు లొంగని పరిస్థితి) ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రపంచ యాంటీమైక్రోబియల్ అవగాహన వారోత్సవాలు, జాతీయ నవజాత శిశు వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో గురువారం నిర్వహించారు.

ప్రపంచ యాంటీమైక్రోబియల్ అవగాహన వారోత్సవాలు నవంబరు 18 నుంచి 24 వరకు, జాతీయ నవజాత శిశు వారోత్సవాలు నవంబరు 15 నుంచి 21 వరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా వినియోగించడం, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ, భద్రతపై చైతన్యం తీసుకురావడం కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు యాంటీబయాటిక్స్ వినియోగం, వాటి ప్రాముఖ్యత, అనవసర వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నివారణ అంశాలపై చర్చా పోటీ నిర్వహించారు. ఇందులో ద్వితీయ, తృతీయ సంవత్సరం వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. యాంటీబయాటిక్స్‌ను సరైన పద్ధతిలో వినియోగించాల్సిన అవసరంపై చర్చించారు. ఈ పోటీ విద్యార్థుల్లో వైద్యపరమైన అవగాహన పెంపొందించేందుకు దోహదపడింది.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, పరిపాలనా సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. యాంటీబయాటిక్స్‌ను స్వయంగా వినియోగించకుండా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని, సూచించిన చికిత్సా విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri