Hyderabad: కంచన్‌బాగ్ అపోలో డీఆర్డీఓ సిల్వర్ జూబ్లీ వేడుకలు!
Hyderabad: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు అడ్మినిస్ట్రేటర్, సూపరింటెండెంట్ తెలిపారు.
Hyderabad: కంచన్‌బాగ్ అపోలో డీఆర్డీఓ సిల్వర్ జూబ్లీ వేడుకలు!
Hyderabad: కంచన్‌బాగ్‌లోని అపోలో హాస్పిటల్స్ డీఆర్డీఓ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌తో పాటు వరల్డ్ హార్ట్ డే 2026 కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మహమ్మద్ అబ్దుల్లా నఫేహ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
సెప్టెంబర్ 29న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ అసోసియేషన్‌తో కలిసి 5కే రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, డా ఆర్. శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
అదే రోజు ఉదయం 11 గంటలకు జరిగే ప్రధాన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్, మిస్సైల్స్ & స్ట్రాటజిక్ సిస్టమ్స్, డీఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అలాగే రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి పాల్గొననున్నారు.
ఆస్పత్రిలో 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉద్యోగులను అన్ని విభాగాల నుంచి ఎంపిక చేసి బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డులతో సత్కరించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్‌కు వచ్చే పేషెంట్ల కోసం ప్రత్యేకంగా హెల్త్ కార్డులను ఉచితంగా అందజేసి, వివిధ వైద్య సేవలపై రాయితీలు కల్పించనున్నట్లు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మహమ్మద్ అబ్దుల్ నఫేహ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలకృష్ణ తెలిపారు.




