Lb Nagar: నోటితో మహాత్మా గాంధీ చిత్రాన్ని గీసి కళాకారుడు రాము వినూత్న ప్రయోగం!
Lb Nagar: గాంధీ జయంతి సందర్భంగా ఎల్‌బీనగర్‌కు చెందిన చిత్రకారుడు నాగార్జునపు రాము నోటితో మార్కర్ పెన్ను పట్టుకుని మహాత్మా గాంధీ చిత్రాన్ని అద్భుతంగా గీశారు.
Lb Nagar: నోటితో మహాత్మా గాంధీ చిత్రాన్ని గీసి కళాకారుడు రాము వినూత్న ప్రయోగం!
Lb Nagar: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎల్‌బీనగర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు నాగార్జునపు రాము వినూత్న చిత్రకళా ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నోటిలో మార్కర్ పెన్ను పెట్టుకుని ఏకంగా మహాత్మా గాంధీ చిత్రాన్ని నోటితోనే గీసి తన కళా ప్రతిభను చాటుకున్నారు.
సాధారణంగా చేతులతో చిత్రాలు గీసే కళాకారులకు భిన్నంగా.. నోటితో మార్కర్ పెన్నును పట్టుకుని గాంధీజీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ వినూత్న ప్రయత్నం ద్వారా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
“సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం” అని పేర్కొంటూ ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.




