Hyderabad: భూమి పూజ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు తరలిరావాలి
Hyderabad: ఈ నెల 13న ఉప్పల్ బగాయతులో ఆర్యవైశ్య మహాసభ భూమి పూజ. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల విజయభాస్కర్ వెల్లడి.
Hyderabad: భూమి పూజ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు తరలిరావాలి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ బగాయతులో ఆర్యవైశ్య మహాసభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో జరుగు భూమి పూజ( శంకుస్థాపన) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీ పెండ్యాల విజయభాస్కర్ కోరారు.
భూమి పూజ అనంతరం శ్రీనివాస కళ్యాణం, 10.30 గంటలకు ఆత్మీయ సమ్మేళనం జరగనున్నట్లు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు ఆర్యవైశ్య ప్రముఖులు
టీజీ వెంకటేష్, బొగ్గారపు దయానంద్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బిగాల గణేష్ గుప్తా, కోలేటి దామోదర్, పలువురు ప్రముఖులు పాల్గొన నున్నట్లు ఆయన పేర్కొన్నారు, ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల, మండలాలు పట్టణాల నుండి ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజయ భాస్కర్ కోరారు.




