AS Rao Nagar: పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి!
AS Rao Nagar: బస్తీ దవాఖాన ఎక్స్‌టెన్షన్ భవనాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అలాగే ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ
AS Rao Nagar: పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి!
ఏ.ఎస్.రావు నగర్: ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, పరిశుభ్రమైన పరిసరాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. బస్తీ దవాఖానల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడి ప్రజల ఆరోగ్యం మరింత రక్షించబడుతుందని పేర్కొన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని కల్పించేందుకు తాను నిరంతరం కృషి చేస్తున్నానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ గీత మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి మాజీ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి కె. సోమశేఖర రావు జి. వీరయ్య ఐ. శివ శంకర రావు ఎస్. శంకర రావు ఎ. వెంకటేశ్వర రావు
సి. చంద్రశేఖర్ పార్టీ నాయకులు కార్యకర్తలు డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.




