Hyderabad: విద్యార్థుల హక్కుల కోసం బీజేవైఎం నిరంతరం పోరాడుతుంది ఎన్వీఎస్‌ఎస్
Hyderabad: డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్‌లోని డిగ్రీ కళాశాలల్లో ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ పర్యటన. 'ఫీజుల బకాయి - బీజేపీ లడాయి' పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థులకు పిలుపు.
Hyderabad: విద్యార్థుల హక్కుల కోసం బీజేవైఎం నిరంతరం పోరాడుతుంది ఎన్వీఎస్‌ఎస్
హైదరాబాద్: విద్యార్థుల హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా పోరాటం ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ నేతృత్వంలో డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ లోని ఈసీఐఎల్ పరిధి లోని శ్రీ ఆదర్శ డిగ్రీ కాలేజ్ , వసుంధర డిగ్రీ కాలేజ్లను సందర్శించి కళాశాల యాజమాన్యాన్ని కలిసి, విద్యార్థులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల బకాయిల సమస్యలు, విద్యా రంగంలో ఉన్న ఇబ్బందులు పైన భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన ఫీజుల బకాయి – బీజేపీ లడాయి కార్యక్రమం లక్ష్యాలను విద్యార్థులకు వివరించి, ఈ ఉద్యమానికి తమ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులపై ఫీజుల భారం, బకాయిల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా యువ మోర్చా పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో:జిల్లా కార్యదర్శి అంబటి వెంకటాచలం జిల్లా కార్యవర్గ సభ్యులు జీవీఎన్ రావు డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్యారెడ్డి డివిజన్ ఉపాధ్యక్షుడు సోమేశ్ నాయుడు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉమా శ్రీధర్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏనుగు రాజిరెడ్డి యువ మోర్చా జిల్లా కార్యదర్శి నాగపురి నవీన్ యువ మోర్చా నాయకుడు జూపల్లి అరుణ్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




