Hyderabad: ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో జి+50 అంతస్తులతో ‘ఏఎస్‌బిఎల్ లెగసీ’ ప్రారంభం!
Hyderabad: ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఏఎస్‌బిఎల్ లెగసీ’. 7.97 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ అత్యంత ఎత్తైన జి+50 అంతస్తుల నివాస ప్రాజెక్ట్ వివరాలు.
Hyderabad: ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో జి+50 అంతస్తులతో ‘ఏఎస్‌బిఎల్ లెగసీ’ ప్రారంభం!
Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో ఏఎస్‌బిఎల్ సంస్థ తన ప్రతిష్ఠాత్మక నివాస ప్రాజెక్ట్ ఏఎస్‌బిఎల్ లెగసీని ప్రారంభించింది. సుమారు 7.97 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో జి+50 అంతస్తుల మూడు టవర్లు ఉండగా, ఈ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. రూ.1.99 కోట్ల ప్రారంభ ధరతో 3, 4 బీహెచ్‌కే గృహాలను అందిస్తోంది.
73 శాతానికి పైగా ఓపెన్ స్పేస్‌తో పాటు 74 వేల చదరపు అడుగుల క్లబ్‌హౌస్, 50కి పైగా సౌకర్యాలను ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ మెట్రో స్టేషన్‌కు కేవలం రెండు నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సెంట్రల్ హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీ జీవనశైలిని అందించడమే లక్ష్యమని ఏఎస్‌బిఎల్ సీఈఓ, వ్యవస్థాపకుడు అజితేష్ కొరుపోలు తెలిపారు.




