Hyderabad: చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో వైభవంగా వారాహి నవరాత్రులు

Hyderabad: హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో ఆషాఢమాస వారాహి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

RAJESH,	WEST ZONE
Published on: 3 July 2026 6:34 PM IST
Hyderabad
X

Hyderabad: చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో వైభవంగా వారాహి నవరాత్రులు

Hyderabad: చాముండేశ్వ‌రి అనుగ్ర‌హ పీఠం ఆధ్వ‌ర్యంలో ఆషాడ‌మాస వారాహి న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు ఆధ్యాత్మిక వేత్త శ్రీక‌ష్ణ చాముండేశ్వ‌రి మ‌హ‌ర్షి అన్నారు. హైద‌రాబాద్ శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని శ్రీ చాంముడేశ్వ‌రి అనుగ్ర‌హ పీఠంలో ఆషాడ మాసంలో వచ్చే శ్రీ వారాహి నవరాత్రులు ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు.

లలితా పరమేశ్వరి సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు అన‌గా ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు భక్తిశ్రద్ధలతో పూజిస్తే శత్రుబాధలు తొలగి, సకల ఐశ్వర్యాలు, వ్యాపార వృద్ధి చేకూరుతాయన్నారు. ఇక దీంతో పాటు చాముండేశ్వ‌రి అనుగ్ర‌హ పీఠంలో అతిపురాణ‌ సాల‌గ్రామం శిల‌లు సైతం ఉన్నాయ‌ని తెలిపారు.

హిమాల‌య న‌దీ ప్ర‌వాహంలోని అరుదుగా ల‌భించే సాల‌గ్రామం న‌ల్ల‌టి శిల అని ఇవి స్వయంగా విష్ణుమూర్తి స్వ‌రూపమ‌ని శంక‌రాచార్యులు ప్ర‌చారం చేశార‌ని శ్రీక‌ష్ణ చాముండేశ్వ‌రి మ‌హ‌ర్షి తెలిపారు. ఈ న‌దిలో ల‌భించే శిల‌ల అత్యంత విశేష‌మైనవ‌న్నారు. దీంతో పాటు రుద్రాక్ష‌లు ధ‌రించ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి కీడు శంకించ‌ద‌ని...చెడు ప్ర‌భావాలు తొల‌గిపోతాయ‌న్నారు.

రుద్రాక్ష‌లు ధ‌రించిన భ‌క్తుల‌ను ,శివారాధ‌కులు, స‌ర్వ‌శ‌క్తివంతుడైన భ‌గ‌వంతుడు ఎల్లప్పుడు ర‌క్షిస్తాడ‌నే న‌మ్మ‌కంతో వీటి మెడ‌లో ధ‌రిస్తార‌ని తెలిపారు. ఈ ఏడాది ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ హైద‌రాబాద్ ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా తాను స్వయంగా త‌యారు చేసిన రుద్రాక్ష‌మాల‌ను ప్ర‌ధాని మోడీకి అందించ‌డం త‌న‌కెంతో సంతోషాన్ని క‌ల్గించింద‌న్నారు.

చాముండేశ్వ‌రి అనుగ్ర‌హ పీఠం నుండి త‌యారు చేసిన రుద్రాక్ష‌మాల‌ను చూపించ‌గా...వెంట‌నే స్పందించిన మోడీ మ‌హాత్మా మాల లేకే ఆయా...అని రుద్రాక్ష‌మాల‌ను తీసుకుర‌మ్మ‌ని వారే స్వ‌యంగా చెప్పార‌ని తెలిపారు. మోడీ కోసం స్వయంగా త‌యారు చేసిన రుద్రాక్ష‌మాల‌ను తీసుకోవ‌డం త‌న‌కెంతో సంతోషాన్ని క‌ల్గించింద‌ని మ‌హ‌ర్షి ఆనందం వ్య‌క్తం చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story