Cherlapally: చర్లపల్లి ఓపెన్ జైల్ సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్
Cherlapally: చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం ఓపెన్ జైలు సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.
Cherlapally: చర్లపల్లి ఓపెన్ జైల్ సూపరింటెండెంట్‌గా అశోక్ కుమార్
చర్లపల్లి: చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం ఓపెన్ జైలు పర్యవేక్షణ అధికారిగా అశోక్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఓపెన్ జైలు సూపరిండెంట్ గా పనిచేస్తున్న భరత్ రెడ్డి హెడ్ ఆఫీస్ కు బదిలీపై వెళ్లారు ఆయన స్థానంలో నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న అశోక్ కుమార్ ఓపెన్ జైల్ కు బదిలీపై వచ్చారు.
శనివారం అశోక్ కుమార్ ఓపెన్ జైల్లో బాధ్యతలు స్వీకరించారు. అశోక్ కుమార్ గతంలో ఓపెన్ జైల్లో జైలర్ గా పని చేసిన అనుభవం ఉంది. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఖైదీల సహకారంతో జైలు అభివృద్ధికి ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.




