Serilingampally: నియోజకవర్గంలో 56 శాతం ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ..
Serilingampally: అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ (SIR) గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు ఈఆర్వో నారాయణ్ అమిత్ ఐఏఎస్ అధికారుల సమీక్షలో తెలిపారు.
Serilingampally: నియోజకవర్గంలో 56 శాతం ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ..
హైదరాబాద్, ఆగస్ట్ 1: శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో ఈరోజు AERO లు, సూపర్వైజర్లు, నోడల్ అధికారులతో ప్రత్యేక "SIR" సమీక్ష సమావేశం నిర్వహించబడినది.
ఈ ముఖ్యమైన సమావేశానికి ఆతిథ్యంగా శ్రీ నారాయణ్ అమిత్ IAS గారు విచ్చేసి అధికారులతో క్షేత్రస్థాయి సమావేశం నిర్వహించరూ.
సమావేశంలో మాట్లాడిన శ్రీ నారాయణ్ అమిత్ IAS గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR కార్యక్రమ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులకు అధికారికంగా తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ప్రస్తుతం సెర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 56% లక్ష్యం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 44% లక్ష్యాన్ని సాధించాల్సి ఉందని తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ERO నారాయణ్ అమిత్ ఐఏఎస్, క్షేత్రస్థాయి సిబ్బందికి విలువైన సలహాలు, సూచనలు అందించారు.
ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడంలో వేగం పెంచాలని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి రోజు టార్గెట్ను సమీక్షించి 100% సాధనకు కృషి చేయాలని సూచించారు.
అనంతరం అధికారులు డిజిటల్ డాష్బోర్డ్ ద్వారా జోన్ వారీగా SIR ప్రగతిని కూడా సమీక్షించారు. ఆగస్టు 10వ తేదీలోపు సెర్లింగంపల్లి నియోజకవర్గంలో 100% లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ సమన్వయంతో, బాధ్యతతో పని చేయాలని నారాయణ్ అమిత్ IAS అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, అన్ని వార్డుల AEROలు, సూపర్వైజర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




