Attapur: ఇస్కాన్ ఆలయంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

Attapur: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 4 Sept 2026 7:49 PM IST
Attapur
X

Attapur: ఇస్కాన్ ఆలయంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

అత్తాపూర్: అత్తాపూర్ ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజలు, హరినామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది

శ్రీకృష్ణుడికి పలు రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూడా రంగు రంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

బృందావనం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన వస్త్రాలతో స్వామివారికి విశేష అలంకరణ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆస్ట్రేలియా, మాయాపూర్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తులకు దర్శన అవకాశం కల్పించడంతో పాటు.. ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీకృష్ణుడిని దర్శించుకున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నారు.

భక్తుల హరినామ సంకీర్తనలు.. పుష్పాలంకరణలు.. ప్రత్యేక పూజలతో అత్తాపూర్ ఇస్కాన్ ఆలయం కృష్ణనామ స్మరణతో మార్మోగుతోంది.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD