Attapur: అత్తాపూర్‌లో నవశక్తి భక్త సమాజ్ 30 ఏళ్ల గణపతి వేడుకలు!

Attapur: హైదరాబాద్ అత్తాపూర్‌లో నవశక్తి భక్త సమాజ్ 30 ఏళ్ల గణపతి వేడుకలు ఘనం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, రికార్డు స్థాయి లడ్డూ వేలంపాటపై సర్వత్రా ఆసక్తి.

RAJESH,	WEST ZONE
Published on: 22 Sept 2026 5:06 PM IST
Attapur
X

Attapur: అత్తాపూర్‌లో నవశక్తి భక్త సమాజ్ 30 ఏళ్ల గణపతి వేడుకలు!

అత్తాపూర్‌: హైదరాబాద్‌ అత్తాపూర్‌లోని పురాతన పోచమ్మ ఆలయం వద్ద నవశక్తి భక్త సమాజ్ ఆధ్వర్యంలో 30 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ భజనలు, కీర్తనలు, హారతి, గణపతి హోమం, అన్నదానం, ముగ్గుల పోటీలు, ఉచిత ఆరోగ్య శిబిరం, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

చివరి రోజు నిర్వహించే గణపతి లడ్డూ వేలంపాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో రికార్డు స్థాయిలో లడ్డూకు భారీ ధర పలకడంతో ఈ వేలంపాట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నారులు, యువతకు బహుమతులు, మెమెంటోలు అందించడంతో పాటు చివరి రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా కన్నుల పండువగా ఊరేగింపు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE