hyderabad: మోదీ దిష్టిబొమ్మ దహనం.. అచ్చే దిన్ కాదు చచ్చే రోజులు తెచ్చారంటూ ఆగ్రహం!
hyderabad: హైదరాబాద్ ఆటోనగర్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
hyderabad: మోదీ దిష్టిబొమ్మ దహనం.. అచ్చే దిన్ కాదు చచ్చే రోజులు తెచ్చారంటూ ఆగ్రహం!
hyderabad: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చిరు వ్యాపారుల బతుకు బండిని కుదేలు చేస్తూ డీజిల్ ఒకేసారి మూడు రూపాయలు పెంచడంతో రవాణా రంగం రోడ్డున పడ్డది కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను ఒకే సారు దాదాపు వెయ్యి రూపాయల వరకు పెంచడంతో ఈ గ్యాస్ నే ఆధారం చేసుకొని చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకు బండిని ఈడుస్తూ జీవనోపాధి పొందుతున్న అనేక మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులతో ప్రజలు వారి కుటుంబ నెలవారి బడ్జెట్ కు మించి అప్పులతో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీనికి తోడు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మూడు రూపాయలు పెంచడంతో రోడ్ల పడ్డ రవాణా రంగం దానికి తోడు కమెర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెంపుతో పరోక్షంగా పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడుతుందని అన్యాన ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం కనికరం లేకుండా గ్యాస్ ధరలు అమాంతం పెంచడం ప్రజలను వంచించడమే అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ ధరను ₹3,251.50 కి చేర్చారు దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది అని ఇది సామాన్యుని దినాందికా జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని విమర్శించారు.
ఎన్నికల ముందు వరకు ఎటువంటి గ్యాస్ కొరత లేదు, మన దేశంపై గ్యాస్ యుద్ధ ప్రభావం లేదు ఎప్పటికప్పుడు గ్యాస్ సరఫరా అవుతుంది ధరలు పెంచాం అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటనలు ఇస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తవడమే తడవుగా కమర్సియల్ గ్యాస్ ధరలను పెంచుతూ దొడ్డిదారిన ప్రజలపై పెనుభారం మోపటం మొమ్మాటికి ప్రజలకు ద్రోహం చేయటమే అని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సాకులు చూపుతూ, పేదల పొయ్యిలో నిప్పులు పోసి అదానీ-అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల జేబులు నింపడమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
"అచ్చే దిన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి, సామాన్యుడికి 'చచ్చే రోజులు' తెచ్చింది. తక్షణమే పెంచిన ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుంది." అని హెచ్చరించారు పెంచిన వాణిజ్య గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. అలాగే గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించి నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులోకి తెచ్చి నిత్యావసరాల ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలకు చిద్రమైన చిన్న వ్యాపారులు.




