Talakondapalle: తలకొండపల్లి దుర్గామాత మండపం వద్ద ఆవంచ నరసింహారెడ్డి అన్నదానం!

Talakondapalle: తలకొండపల్లిలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద కాంగ్రెస్ నేత ఆవంచ నరసింహారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 14 Oct 2026 7:48 AM IST
Talakondapalle
X

Talakondapalle: తలకొండపల్లి దుర్గామాత మండపం వద్ద ఆవంచ నరసింహారెడ్డి అన్నదానం!

Talakondapalle: తలకొండపల్లి మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవంచ నరసింహారెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవంచ నరసింహారెడ్డి హాజరై భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం పట్ల ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో సేవా భావం, ఐక్యత పెరుగుతుందని అన్నారు. గ్రామంలో అందరూ కలిసి ఇలాంటి పండుగలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, దుర్గామాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపా. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు ఎరుకలి యాదయ్య, మీసేవ మల్లేష్, పుట్ట పాండు, కటికెల శ్రీశైలం, శ్రీకాంత్, కమాల్, శ్రీకాంత్, నిశాంత్ రెడ్డి, కృష్ణ, మల్లేష్, ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY