Malkajgiri: బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్ద కనీసం పూలదండ కూడా లేదా?
Malkajgiri: బాబు జగ్జీవన్‌రామ్ 40వ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరిలో ఆయన విగ్రహాల నిర్లక్ష్యంపై నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Malkajgiri: బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్ద కనీసం పూలదండ కూడా లేదా?
మల్కాజ్గిరి: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 40వ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయన విగ్రహాల వద్ద కనీస పూల అలంకరణ, పరిశుభ్రత చర్యలు కూడా చేపట్టకపోవడాన్ని నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ యంత్రాంగం, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా దళిత మహానేతను అవమానించినట్టేనని కమిటీ నాయకులు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. బాబు జగ్జీవన్‌రామ్ వంటి జాతీయ నాయకుడి వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇలాంటి నిర్లక్ష్య ధోరణి దళిత సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి జాతీయ నాయకుడి జయంతి, వర్ధంతి సందర్భంగా విగ్రహాల వద్ద పరిశుభ్రత, పూల అలంకరణ, అధికారిక నివాళి కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పగిడిపల్లి మీ పేరు పాల్గొన్నారు శ్రీనివాస్, గంగాధరి కృష్ణ, జంగిలి శివకుమార్, ఎలిమెల్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.




