Bachupally: బాచుపల్లి వాసులకు గుడ్ న్యూస్.. నేడే ప్రారంభం కానున్న నూతన ఫ్లైఓవర్!

Bachupally: బాచుపల్లి చౌరస్తాలో రూ. 65.53 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ వంతెనను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 8 Jun 2026 9:59 AM IST
Bachupally
X

Bachupally: బాచుపల్లి వాసులకు గుడ్ న్యూస్.. నేడే ప్రారంభం కానున్న నూతన ఫ్లైఓవర్!

Bachupally: బాచుపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడునున్నాయి. మియాపూర్-గండిమైసమ్మ మార్గంలోని బాచుపల్లి చౌరస్తాలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.65.53 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవం రెడ్డి నేడు సాయత్రం ప్రారంభించనున్నారు. దీంతో పరిసర ప్రజలు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న కళ సాకారం కాబోతుంది. మియాపూర్ చౌరస్తాలో రాత్రి 7 గంటలకు జరగనున్న సమీకృత అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు.

బాచుపల్లి వంతెనను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. జవనరి 25, 2022న వంతెన పనులకు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనేక పరిణామాల మధ్య నాలుగేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల పనులు పూర్తయ్యాయి.

మే మొదటి వారంలోనే దీన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేసినప్పటికీ అవాంతరాల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ వంతెన అందుబా టులోకి వస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాంపేట సర్కిల్ పరిధిలో ఇదే ప్రథమ వంతెన కావడం కూడా ఇక్కడి ప్రజలు విశేషంగా చెబుతున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story