Medchal: మేడ్చల్ జిల్లా పూడూర్‌లో అధ్వానంగా మారిన రోడ్డు పరిస్థితి!

Medchal: మేడ్చల్ జిల్లా పూడూర్ కిష్టాపూర్ 298 డివిజన్‌లో అధ్వానంగా మారిన రోడ్డు. బురదమయమైన మార్గంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, పాదచారులు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 26 Sept 2026 10:02 AM IST
Medchal
X

Medchal: మేడ్చల్ జిల్లా పూడూర్‌లో అధ్వానంగా మారిన రోడ్డు పరిస్థితి!

Medchal: పూడూర్ కిష్టాపూర్ 298 డివిజన్‌లోని పూడూరు నుంచి రింగ్ రోడ్డు వైపు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డంతా బురదమయం కావడంతో పాటు భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి, బురదగా మారడంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL