Hyderabad: బడంగ్‌పేట్ జంట హత్యల కేసును ఛేదించిన మీర్‌పేట్ పోలీసులు!
Hyderabad: బడంగ్‌పేట్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును ఛేదించిన మీర్‌పేట్ పోలీసులు. నిందితుడు మహమ్మద్ సిద్ధిఖీ అరెస్ట్, కారు మరియు కత్తి స్వాధీనం.
Hyderabad: బడంగ్‌పేట్ జంట హత్యల కేసును ఛేదించిన మీర్‌పేట్ పోలీసులు!
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ శివారు బడంగ్‌పేట్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును చేదించిన మీర్పేట్ పోలీసులు. కుటుంబ కలహాల నేపథ్యంలో కత్తితో దాడి చేసి ఇద్దరిని హత్య చేయడంతో పాటు మరొకరిని తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. బడంగ్‌పేట్‌లోని సాయి విహార్ నగర్ ఫేజ్-2లో నవంబర్ 4వ తేదీన ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో నిరంజన్ బీ, మహమ్మద్ రేష్మా అక్కడికక్కడే మృతి చెందగా, యూసుఫ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ వివాదాలే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ సిద్ధిఖీ (42)ని నవంబర్ 5న శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో అరెస్టు చేసిన మీర్‌పేట్ పోలీసులు.
నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మారుతి వాగనార్ కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
శంషాబాద్ జోన్ డీసీపీ బి. రాజేష్ పర్యవేక్షణలో ఆదిబట్ల ఏసీపీ డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో కేసును చేదించిన మీర్పేట్ పోలీసులు పోలీసులు. నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించిన కమిషనర్.




