Raviryal: రావిర్యాలలో ఘనంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం
Raviryal: మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు మరియు బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Raviryal: రావిర్యాలలో ఘనంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం
రావిర్యాల: మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – విద్యా వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా ప్రమాణాల అభివృద్ధి మరియు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “బడిబాట” కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం,డిజిటల్ బోధన, క్రీడలు మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుత.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు మరింత పెరిగి, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,జెడ్పీహెచ్‌ఎస్. (బాలుర) కాంగర రావిర్యాల విద్యార్థులు పాల్గొన్నారు.




