Hyderabad: ఎమ్మెల్యే మందుల సామెల్‌కు బహుజన సేన అండ..
Hyderabad: ఎమ్మెల్యే మందుల సామెల్‌పై అగ్రకుల నేతల జులుంను ఖండిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహుజన సేన అధ్యక్షుడు కదిరే కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Hyderabad: ఎమ్మెల్యే మందుల సామెల్‌కు బహుజన సేన అండ..
హైదరాబాద్: నల్గొండ జిల్లా పూర్వపు తుంగతుర్తి నకిరేకల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో గెలుపొందిన బహుజన ప్రతినిధి శాసనసభ్యులు మందుల సామెల్ పై అదే జిల్లాకి చెందిన మంత్రివర్యులు బ్రదర్స్ జులుం కి పాల్పడుతున్నారని బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు కదిరే కృష్ణ ఆరోపించారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ ప్రజా ఫ్రంట్ నాయకులు వాసు కే యాదవ్, నాగనమోని చెన్నా రాములు ముదిరాజ్, తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ బైరి రాకేష్ లతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల ద్వారా ఎన్నుకొని రాబడిన బడుగు బలహీనవర్గ నాయకులపై అగ్రకుల నాయకుల తీవ్రమైన అని చెవేత అవమానకర ధోరణి పెరుగుతుందని అన్నారు. బహుజన దళిత నాయకుల జోలికి వస్తే ఎంత పెద్ద నాయకుల కైనా పతనం తప్పదని హెచ్చరించారు. వెంటనే బ్రదర్స్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బ్రదర్స్ మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో బడుగు బలహీన వర్గాల ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.




