Kukatpally: విద్యుత్ షాక్‌తో యువకుడు అక్కడికక్కడే మృతి!

Kukatpally: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాపు బోర్డు ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్‌తో సంజు చౌదరి (26) మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు.

Maruthisagar, Kukatpally
Updated on: 17 Aug 2026 2:25 PM IST
Kukatpally
X

Kukatpally: విద్యుత్ షాక్‌తో యువకుడు అక్కడికక్కడే మృతి!

Kukatpally: బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురు కృప ప్లైవుడ్‌ అండ్‌ హార్డ్‌వేర్‌ షాపు బోర్డును ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్‌ తీగలు తగలడంతో సంజు చౌదరి (26) విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.

తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. కేసు నమోదు చేసి బాలనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story