Kukatpally: బాలానగర్‌లో గణేష్ ఉత్సవాలపై శాంతి కమిటీ సమావేశం!

Kukatpally: కూకట్‌పల్లి పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

Maruthisagar, Kukatpally
Published on: 7 Sept 2026 6:40 PM IST
Kukatpally
X

Kukatpally: బాలానగర్‌లో గణేష్ ఉత్సవాలపై శాంతి కమిటీ సమావేశం!

కూకట్‌పల్లి: బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఏసీపీ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు డీజేలు, ప్యాడ్ బ్యాండ్ మ్యూజిక్‌పై ఆంక్షలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్, డీఐ సక్రామ్, ఎస్‌ఐలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story