Balapur: బాలాపూర్‌లో నేడు గణనాథుని తొలి పూజ - తరలివస్తున్న భక్తులు!

Balapur: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. పూరి జగన్నాథ ఆలయ నమూనా సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RAHUL, MEERPET
Published on: 14 Sept 2026 3:49 PM IST
Balapur
X

Balapur: బాలాపూర్‌లో నేడు గణనాథుని తొలి పూజ - తరలివస్తున్న భక్తులు!

Balapur: వినాయక చవితి సందర్భంగా బాలాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు.

వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం నుండి నగర నలుమూలల నుంచి భక్తులు బాలాపూర్‌కు తరలివస్తున్నారు. గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తుల రాకతో బాలాపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ ఏడాది బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పూరి జగన్నాథ ఆలయ నమూనా సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయాన్ని పోలిన భారీ సెట్టింగ్‌ను ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు.

సెట్టింగ్ నిర్మాణం, అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లను అందుబాటులో ఉంచడంతో పాటు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET