Balapur: ఘనంగా వినాయక చవితి వేడుకలు - హాజరైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

Balapur: బాలాపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. భారీగా తరలివచ్చిన భక్తులు.

RAHUL, MEERPET
Published on: 14 Sept 2026 11:57 PM IST
Balapur
X

Balapur: ఘనంగా వినాయక చవితి వేడుకలు - హాజరైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బాలాపూర్‌: రంగారెడ్డి జిల్లా వినాయక చవితి సందర్భంగా బాలాపూర్‌లో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ సమితి సభ్యులు తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ సమితి సభ్యులు, వాలంటీర్లను అందుబాటులో ఉంచడంతో పాటు అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

తొలి పూజా కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు వారికి స్వాగతం పలికారు.

వినాయక చవితిని పురస్కరించుకుని బాలాపూర్‌కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బాలాపూర్‌కు చేరుకున్నారు. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బాలాపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు సిబ్బంది,ఉత్సవ సమితి నిర్వాహకులు, వాలంటీర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET