Balapur: బాలాపూర్ పోక్సో కేసు: నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
Balapur: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడు సమీర్ ఖాన్‌కు ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
Balapur: బాలాపూర్ పోక్సో కేసు: నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
హైదరాబాద్: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
కేసులో నిందితుడైన హైదరాబాద్ తాడ్‌బన్‌కు చెందిన సమీర్ ఖాన్ (21), వృత్తి కార్పెంటర్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. శుక్రవారం (సెప్టెంబర్ 18) తీర్పు వెలువరించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.
బాలాపూర్ పోలీస్‌స్టేషన్ క్రైమ్ నంబర్ 264/2021లో ఐపీసీ సెక్షన్ 376(2)(n), పోక్సో చట్టంలోని సెక్షన్ 5(j)(ii) రెడ్ విత్ 6 కింద కేసు నమోదైంది. ఈ కేసు ఎస్సీ నంబర్ 803/2022గా కోర్టులో విచారణ కొనసాగింది.
ఈ కేసులో దర్యాప్తు చేసి ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టినట్లు బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.




