Rangareddy: మాకొద్దు డంపింగ్ యార్డ్.. గ్రామస్తుల నిరసన!

Rangareddy: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండ రావిరాల గ్రామంలో ప్రతిపాదిత 'ఎకోటౌన్ డంపింగ్ యార్డ్' పై ప్రజాగ్రహం.

AJAY, HAYATH NAGAR
Published on: 31 May 2026 12:14 PM IST
Rangareddy
X

Rangareddy: మాకొద్దు డంపింగ్ యార్డ్.. గ్రామస్తుల నిరసన!

Rangareddy: ఎకోటౌన్ పేరిట రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బండ రావిరాల సర్వేనెంబర్ 268 లోని 494 ఎకరాలలో బండరావిరాలలో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ ను వెంటనే తరలించాలని బండ రావిరాల గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే నష్టాలపై గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ ను ఇక్కడినుంచి తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని గ్రామస్తులు కోరిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామస్తులు ఒకవైపు మైనింగ్ మరోవైపు మూసి నుండి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మళ్లీ డంపింగ్ యార్డ్ పేరుతో గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వెంటనే తొలగించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను కోరిన కూడా సమస్య పరిష్కారం కాలేదని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితమై చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందని, పాడి పశువులు చనిపోయే ప్రమాదం ఉందని, ప్రజలకు అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అలాగే రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు.

గ్రామ శ్రేయస్సు కోసం అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే తన సర్పంచ్ పదవి రాజీనామా చేస్తానన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story