Meerpet: మీర్పేట్‌లో బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా

Meerpet: మీర్పేట్ ఎన్టీఆర్ నగర్‌లో బంగారు మైసమ్మ అమ్మవారి శిలా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 29 April 2026 11:08 AM IST
Meerpet
X

Meerpet

Meerpet: మీర్పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి శిలా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు వంజరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నవధాన్యాల సమర్పణ, మంత్రోచ్చారణల మధ్య ఘనంగా సాగింది. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించి గౌరవించారు.

ఈ కార్యక్రమంలో విగ్రహ దాత పాతకోటి ఉమా శ్రీనివాస్ దంపతులు, ఆలయ అర్చకులు, కాలనీ అధ్యక్షుడు వాసుచారి, సెక్రటరీ మధు ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story