Hyderabad: పెళ్లి పేరుతో మేకప్ ఆర్టిస్ట్‌పై లైంగిక దాడి.. జిమ్ ట్రైనర్ అరెస్ట్

Hyderabad:ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 25 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి, బ్లాక్‌మెయిల్ చేసిన జిమ్ ట్రైనర్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 20 Nov 2026 12:22 PM IST
Hyderabad
X

Hyderabad: పెళ్లి పేరుతో మేకప్ ఆర్టిస్ట్‌పై లైంగిక దాడి.. జిమ్ ట్రైనర్ అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారం కేసులో జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 25 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన శరత్‌చంద్ర (39) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. 2025లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

అనంతరం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో కొంతకాలం సహజీవనం చేసినట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరగా నిందితుడు ముఖం చాటేయడంతో పాటు, తన ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE