Hyderabad: ఎక్సైజ్ శాఖపై అసత్య ఆరోపణలను ఖండించిన బార్ అసోసియేషన్!

Hyderabad: జేఏసీ ముసుగులో ఎక్సైజ్ శాఖపై, కమిషనర్‌పై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్.

GIRI, CENTRAL ZONE
Published on: 1 Oct 2026 5:00 PM IST
Hyderabad
X

Hyderabad: ఎక్సైజ్ శాఖపై అసత్య ఆరోపణలను ఖండించిన బార్ అసోసియేషన్!

Hyderabad: ప్రభుత్వానికి రెవెన్యూ పెంచడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న అబ్కారీ శాఖ కమిషనర్ పై... జేఏసీ నాయకుడు రాచాల యుగంధర్ గౌడ్ అసత్య ఆరోపణలతో బురద జల్లుతున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు. కమిషనర్ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారని మాట్లాడటం సరికాదని ఐఏఎస్, ఐపి ఎస్ అధికారులకు పరిధి ఉండదన్న విషయాన్ని యుగంధర్ గ్రహించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న యుగంధర్ గౌడ్ అబ్కారీ శాఖలో అవినీతి జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

జేఏసీల ముసుగులో కొంతమంది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని. ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేయడం, ఏసిబికి ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని. ఒకవేళ జరిగినా విజిలెన్స్‌తో పాటు ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరుపుతుందన్నారు.

జేఏసీల ముసుగులో కొంతమంది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. బెదిరించడం సరికాదన్నారు. ఎక్సైజ్ శాఖ బదిలీల్లో అవినీతి జరిగిందని కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారని బయటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE