Hyderabad: నూతన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

hyderabad: కొత్తపేటలోని భాగ్యనగర్ బ్రాహ్మణ భవనంలో బ్రాహ్మణ పరిషత్ నూతన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యంలను ఘనంగా సన్మానించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 17 May 2026 5:20 PM IST
Hyderabad
X

Hyderabad: నూతన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

హైదరాబాద్: ఎల్బీనగర్....భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని భాగ్యనగర్ బ్రాహ్మణ భవనంలో అన్ని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బ్రాహ్మణ పరిషత్ నూతన చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం లకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజానికి చెందిన ప్రముఖులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవ, ఐక్యత, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది.

సమావేశంలో బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. యువతకు విద్యా, ఆర్థిక సహాయం అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. భాగ్యనగర బ్రాహ్మణ సొసైటీ అధ్యక్షురాలు వై. భవాని,కార్యదర్శి పి.ఎస్.ఎస్.ఎస్.వి ప్రసాద్, (వైష్ణవి ప్రసాద్) మాట్లాడుతూ..సభ్యులందరూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story