Hyderbad: బ్రాహ్మణుల కోసం ప్రత్యేక క్రెడిట్ సొసైటీ.. మంత్రి శ్రీధర్ బాబు

Hyderabad: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా బసవరాజు శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 May 2026 9:38 PM IST
Hyderbad
X

Hyderbad: బ్రాహ్మణుల కోసం ప్రత్యేక క్రెడిట్ సొసైటీ.. మంత్రి శ్రీధర్ బాబు

Hyderabad: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ల పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం నాగోల్ ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్ మరియు వైస్ చైర్మన్ పోన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం పరిషత్ జరగాలని చైర్మన్ వైస్ చైర్మన్ లు కావాలని ఆలోచనతో నియామకం చేయడం జరిగింది. అందరూ శక్తి గా నిలబడేది బ్రహ్మనత్వం. బ్రహ్మణలకు మంచి జరగాలనే ఉద్దేశ్యం తో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. క్రెడిట్ సొసైటీ ని తీసుకవస్తాం అన్ని వర్గాలకు సంక్షేమం కోరేవాడు బ్రాహ్మణుడు ఎన్నికైన వారు క్రీయాశీలకంగా ఉండి సేవ చేయాలి.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ

గత ప్రభుత్వం లో బ్రాహ్మణ సంక్షేమం సంఘం ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రకాల లబ్ది చేకూరుతుంది. దేవాదాయ శాఖ రూపంలో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి నాకు అవకాశం రావడం చాలా సంతోషం. దేవయాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. ప్రతి ఊరిలో గుడి ఉండాలి, దేవాలయాలను అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీది. రిటైర్డ్ అయిన బ్రహ్మణులకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయి. దానిని 8 లక్షల కు పెంచుతాం. గత ప్రభుత్వం బ్రహ్మనులను నిర్లక్ష్యం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story