Serilingampally: బస్తీ దవాఖానాలపై నిర్లక్ష్యం: రేవంత్ సర్కార్‌పై మాధవరం రంగారావు ఆగ్రహం!
Serilingampally: శేరిలింగంపల్లిలో బస్తీ దవాఖానాను సందర్శించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు.
Serilingampally: బస్తీ దవాఖానాలపై నిర్లక్ష్యం: రేవంత్ సర్కార్‌పై మాధవరం రంగారావు ఆగ్రహం!
Serilingampally: శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్‌లో ఉన్న బస్తీ దవాఖానాను సందర్శించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉండేలా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. గతంలో ఈ దవాఖానాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుమారు 60 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేవారు. అలాగే అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు మరియు ఇతర సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించేవారు.
కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బస్తీ దవాఖానాల వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండే దాదాపు 60 రకాల పరీక్షలు చేసేవారు కానీ ప్రస్తుతం కనీసం 20 రకాల పరీక్షలు కూడా నిర్వహించడం లేదని తెలిపారు.
రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని గొప్పగా చెబుతున్నప్పటికీ, ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందన్నారు. గత నాలుగు నెలలుగా డాక్టర్లు, నర్సులు మరియు ఇతర సిబ్బందికి జీతాలు అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయినప్పటికీ వారు తమ విధులను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎర్ర లక్ష్మయ్య, ఆంజనేయులు, బాబు, బొమ్మ శ్రీధర్, రాంబాబు, బీమ్, బాలయ్య, తిరుపతి రావు, మహేందర్ తదితరులు పాలుగొన్నారు.




