Hyderabad: ఏఎస్ రావు నగర్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Hyderabad: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ కమలానగర్లో ఎల్లాపు సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. డాక్టర్ మాదాసు సంజీవరావు దంపతుల హాజరు!
Hyderabad: ఏఎస్ రావు నగర్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Hyderabad: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, పూల వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కాప్రా సర్కిల్లోని ఏఎస్ రావు నగర్ డివిజన్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ఎల్లాపు సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు డాక్టర్ మాదాసు సంజీవరావు ఆయన సతీమణి విజయలక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్లాపు భవన్ ట్రస్ట్ చైర్మన్ను ఘనంగా సత్కరించారు. ఎల్లాపు సంఘానికి విశిష్ట సేవలందిస్తూ, భవన నిర్మాణానికి స్థలం, ఇతర సహకారం అందించడంలో కీలకంగా నిలిచిన వారిని సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని మల్కా రమాదేవి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని, మహిళల ఐక్యతకు, సామాజిక బంధాల బలోపేతానికి ఇలాంటి వేడుకలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు వీర్ల సుధాకర్ రావు, రాజేశ్వరరావు, రాజేందర్ రావు, పెంచాల దేవేందర్ రావు, రామచంద్రరావుతో పాటు యశోద, వినోద, వసంత, పద్మాదేవేందర్ రెడ్డి, పావని రెడ్డి, రజిత, సురేందర్రావు, తిరుమల ప్రభాకర్, దత్తు, రాఘవరెడ్డి, జనార్దన్ గౌడ్, నవీన్, సహదేవ్, ఎం.ఎన్. చారి, సాంబశివరావు, సీఎన్. రావు, జి.వి. నారాయణ, చిట్టి, రేణుక, సునీత, రాజేందర్ రావు, రాణి, రమ, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.




