Tandur: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బీసీ సంఘం!

Tandur: వివాదాస్పద జీఓ నంబర్లు 7, 8, 9లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు తాండూర్ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

Srikanth Reddy, Tandur
Published on: 30 Jun 2026 1:46 PM IST
Tandur
X

Tandur: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బీసీ సంఘం!

తాండూర్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్లు 7, 8, 9ను రద్దు చేసి పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు తాండూర్ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ...

2008లో ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల ఫలితంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమల్లోకి వచ్చిందని తెలిపారు.

ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓలు 7, 8, 9 ప్రకారం విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించి, అనంతరం డీబీటీ ద్వారా డబ్బులు పొందే విధానం పేద కుటుంబాలకు భారంగా మారుతుందని, కాలేజీల నిర్వహణపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.

అందువల్ల ఈ జీఓలను వెంటనే రద్దు చేసి, గతంలో అమలైన విధంగానే నేరుగా విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా ప్రతినిధులు అనిత, నరసమ్మ, మంజుల, జగదీశ్వరి, వీరమణి, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, మండల అధ్యక్షులు నరేందర్, బసంత్, విద్యార్థి నాయకురాలు మంజుల, యువ నాయకులు జోసఫ్, రాము ముదిరాజ్, బంగారు నవీన్, మంతన్ గౌడ్ అశోక్, టైలర్ రమేష్, బీటీ సురేష్, పోచయ్య, చిన్నతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story