OsmaniaUniversity: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన.. 25 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకై ధర్నా
OsmaniaUniversity: రాష్ట్రంలో 25 వేల ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ భారీ నిరసన.
OsmaniaUniversity: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత.. 25 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకై ధర్నా
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో 25 వేల ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ మాట్లాడుతూ..
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీలో విఫలమైన టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలన్నారు.




