Basheerbagh: మలక్‌పేట్ సీఐ నర్సింహా గౌడ్ సస్పెన్షన్‌పై తీవ్ర ఆగ్రహం!

Basheerbagh: బీసీ సంక్షేమ సంఘం నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించి, మలక్‌పేట్ సీఐ నర్సింహా గౌడ్ సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు.

GIRI, CENTRAL ZONE
Published on: 30 July 2026 11:39 PM IST
Basheerbagh
X

Basheerbagh: మలక్‌పేట్ సీఐ నర్సింహా గౌడ్ సస్పెన్షన్‌పై తీవ్ర ఆగ్రహం!

బషీర్బాగ్: రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది.హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్‌తో కలిసి బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ మాట్లాడారు.

ఇటీవల మలక్‌పేట్ సీఐ నర్సింహా గౌడ్‌ను సస్పెండ్ చేయడాన్ని వారు ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించకుండానే ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. నర్సింహా గౌడ్ బీసీ వర్గానికి చెందిన అధికారి కావడం వల్లే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.

సీఐ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నప్పటికీ, అదే అంశాన్ని సస్పెన్షన్‌కు కారణంగా చూపడం తగదన్నారు. బీసీలు ఉన్నత స్థానాలకు ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

సీఐపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కోరారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story