Begumpet: బేగంపేట కంట్రీ క్లబ్‌లో భారత్–టర్కియే సాంస్కృతిక వేడుకలు
Begumpet: హైదరాబాద్ బేగంపేట కంట్రీ క్లబ్‌లో 'ఇండో–టర్కియే కల్చరల్ అండ్ హాస్పిటాలిటీ ఈవెనింగ్' వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
Begumpet: బేగంపేట కంట్రీ క్లబ్‌లో భారత్–టర్కియే సాంస్కృతిక వేడుకలు
Begumpet: బేగంపేట కంట్రీ క్లబ్‌లో ప్రత్యేక ఇండో–టర్కియే కల్చరల్ అండ్ హాస్పిటాలిటీ ఈవెనింగ్. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిపబ్లిక్ ఆఫ్ టర్కియే కాన్సుల్ జనరల్ శ్రీ ఓర్హాన్ యాల్మన్ ఒకాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ వ్యవస్థాపకులు, చైర్మన్ రాజీవ్ రెడ్డి కాన్సుల్ జనరల్‌కు కంట్రీ క్లబ్ ప్రీమియం మెంబర్‌షిప్ థాయ్‌లాండ్ మాస్టర్ కార్డ్ ను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకల్లో భాగంగా టర్కియే సంపన్న సాంస్కృతిక వారసత్వం, నైపుణ్య కళలు, ఆధునిక ఫ్యాషన్‌కు ప్రతిబింబంగా టర్క్ మోడా పేరుతో ప్రత్యేక టర్కిష్ థీమ్ ఫ్యాషన్ షోను నిర్వహించారు. మూడు సీక్వెన్స్ లో కొనసాగిన ఫ్యాషన్ షో అందరిని మంత్రముగ్దులను చేసింది. భారత్–టర్కియే దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కొనసాగింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కంట్రీ క్లబ్ వ్యవస్థాపకులు, చైర్మన్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ... పర్యాటకం, ఆతిథ్య రంగాల ద్వారా ప్రజలు, సంస్కృతులు, దేశాలను అనుసంధానించడం కంట్రీ క్లబ్ లక్ష్యమని చెప్పారు. సంస్థ అంతర్జాతీయ విస్తరణలో తదుపరి దశలో యూరప్‌కు వ్యూహాత్మక ప్రవేశ ద్వారంగా టర్కియేను పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.




