Boduppal: బోడుప్పల్‌లో ‘అర్బన్ పాలిటిక్స్ బెటర్ సిటీస్’ క్యాంపెయిన్ ప్రారంభం

Boduppal: పట్టణ ప్రాంతాల్లో వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ యూత్ కాంగ్రెస్ చేపట్టిన ‘అర్బన్ పాలిటిక్స్ బెటర్ సిటీస్’ కార్యక్రమం బోడుప్పల్‌లో ప్రారంభమైంది.

KARUNAKAR, UPPAL
Published on: 26 Aug 2026 11:23 PM IST
Boduppal
X

Boduppal: బోడుప్పల్‌లో ‘అర్బన్ పాలిటిక్స్ బెటర్ సిటీస్’ క్యాంపెయిన్ ప్రారంభం

బోడుప్పల్‌: పట్టణ ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, పరిష్కారానికి కృషి చేసేందుకు ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ (ఐవైసీ) చేపట్టిన ‘అర్బన్‌ పాలిటిక్స్‌–బెటర్‌ సిటీస్‌’ కార్యక్రమానికి బుధవారం బోడుప్పల్‌ సర్కిల్‌లో శ్రీకారం చుట్టారు.

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొమ్మక్‌ అజయ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు సురేష్‌, చాంద్రిక దుబ్బాక, మేడ్చల్‌ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మక్‌ అజయ్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికులు, ఆటో కార్మికులు, వీధి వ్యాపారులు, రోజువారీ కూలీలు, గిగ్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుంటామని తెలిపారు.

సమస్యలను నమోదు చేసి, వర్గాల వారీగా జాబితా రూపొందించి పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పరిష్కారానికి అవసరమైన కార్యాచరణను చేపడతామని చెప్పారు. తెలంగాణ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సుమారు ఆరు నెలల పాటు క్యాంపెయిన్‌ కొనసాగుతుందని, ప్రతి వారం ఒక్కో వర్గం సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. బోడుప్పల్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. ‘మేరా షెహర్‌–మేరా హక్‌’, ‘మెహ్నత్‌ కా హాత్‌’ నినాదాలతో ప్రజల హక్కుల కోసం, మెరుగైన పట్టణాల నిర్మాణం కోసం కృషి చేస్తామని అజయ్‌ తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story