Hyderabad: ‘భగవద్గీత విశ్వ మహోత్సవం’ బ్రోచర్, వెబ్‌సైట్ ఆవిష్కరణ

Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో భగవద్గీత విశ్వ మహోత్సవ వేడుకల లోగో, వెబ్‌సైట్, బ్రోచర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎం. రాధాకృష్ణ ఆవిష్కరించారు.

RAJESH,	WEST ZONE
Published on: 23 Aug 2026 4:32 PM IST
Hyderabad
X

Hyderabad: ‘భగవద్గీత విశ్వ మహోత్సవం’ బ్రోచర్, వెబ్‌సైట్ ఆవిష్కరణ

హైదరాబాద్: గచ్చిబౌలి వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న జరగబోయే భగవద్గీత విశ్వ మహోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం లోగో, వెబ్ సైట్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎం రాధాకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని భగవద్గీత విశ్వ మహోత్సవం బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

భగవద్గీత విశ్వ మహోత్సవ వేడుకల ప్రత్యేకత ఏమిటంటే.. భగవద్గీతలోని 18 అధ్యాయాలను 18 దేశాల్లో 18 భాషల్లో ఒకేసారి పఠించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం విశేషం. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జర్మనీ, దక్షిణ ఆఫ్రికా, దుబాయ్‌తో పాటు మొత్తం 18 దేశాలకు చెందిన విదేశీయులు భగవద్గీత శ్లోకాలను నేర్చుకుని ఈ వేడుకల్లో ఆలపిస్తారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త సత్యప్రసాద్ నేతృత్వం వహించిన ఈ కార్యక్రమంలో "ఫెమినా మిస్ ఇండియా 2026" విజేత ఇందు ఫాల్గుణి, నేపథ్య గాయకుడు పవన్ చరణ్, ప్రముఖ ప్రవచనకర్త అమరవాది శేషయ్య పాల్గొన్నారు. భగవద్గీతాలాపన కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించనుండటం ఇదే తొలిసారి అని కార్యక్రమ నిర్వాహకులు కృష్ణ తెలిపారు.

శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించిన ఈ భగవద్గీతను విశ్వవ్యాప్తం చేసే ఈ మహత్తర కార్యక్రమం గురించి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story